![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'.ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -436 లో... రుద్రాణి కావాలనే అపర్ణని బాధపెట్టాలి అనుకొని అన్నయ్య తప్పు చేసాడు కదా అంటూ అయిపోయిన విషయం గుర్తుకు చేస్తుంది. దాంతో అందరు రుద్రాణిపై విరుచుకుపడతారు. నన్ను నా గదిలోకి తీసుకొని వెళ్ళమని రాజ్ ని అపర్ణ అడుగుతుంది. దాంతో అపర్ణని తన గదికి రాజ్ తీసుకొని వెళ్తుంటే.. సుభాష్ ని చూసి అపర్ణ చిరాకు పడుతుంది. దాంతో సుభాష్ అక్కడ నుండి వెళ్తాడు.
ఆ తర్వాత కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. నువ్వు ఇక ఈ పనులన్నీ మానెయ్.. నీ వల్లే మా అమ్మకి అలా అయింది. ఆ మాయతో పెళ్లి వరకు తీసుకొని వచ్చావ్. దాంతో పెళ్లి ఆపాలని మా డాడ్ నిజం చెప్పాడు. ఇకనైనా అసలు మాయని వెతకడం గురించి ప్రయత్నం ఆపేయ్ అంటాడు. నేను ఆపను.. అసలు మాయ వస్తేనే కదా.. అసలేం జరిగిందని భయటపడుతుంది. మామయ్య గారు ఏ తప్పు చెయ్యలేదని తెలిసేది అప్పుడే కదా.. అత్తయ్య మావయ్య ఒకటి అవుతారని కావ్య అంటుంది. మరొకవైపు అపర్ణ కూర్చొని కావ్యతో తను ప్రవర్తించిన తీరుని గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. అప్పుడే కావ్య జ్యూస్ తీసుకొని వస్తుంటే.. లోపలికి రావద్దని అపర్ణ చెప్తుంది. నువ్వు నాకు ఎదరుపడకు.. నిన్ను ఫేస్ చేయలేను.. నేను మీ ముందు ఎంత అంటూనే అంత ఎత్తుకు ఎదిగిపోయావ్. నీకు నేనెప్పుడూ అన్యాయం చేశాను. అయిన నీ ముందు నేను తలవంచాను.. నువ్వు ఎప్పుడు మోసం చేసి పెళ్లి చేసిన కనకం కూతురివేనని అపర్ణ అంటుంది. కావ్యకి సారీ చెప్పడానికి తన ఇగో అడ్డువస్తుంది . నేను నిన్ను ఫేస్ చెయ్యలేను కనుకే ఎదరుపడొద్దని అంటున్నానని అపర్ణ అనగానే.. మీ ఆరోగ్యం బాలేదు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. నేను వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతానని చెప్పి.. కావ్య జ్యూస్ పెట్టి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత కావ్యకి కనకం ఫోన్ చేసి.. ఇప్పుడు మీ అతయ్య గారికి ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడే అప్పు నీకు అంత చెప్పింది అన్నమాట అని కావ్య అంటుంది. ఏదో పూజ చేస్తున్నారంట మమ్మల్ని పిలిచారని కనకం అనగానే.. అవును మీరు వస్తున్నారు కదా.. రండి అతయ్య అలా ఉన్నా రాలేదు అనుకుంటారని కావ్య అంటుంది. రాజ్ అపర్ణని వాకింగ్ చేయిస్తుంటాడు. తప్పు చేసిన తండ్రిని వెనకేసుకొచ్చావ్.. ఈ తల్లి గుర్తుకు రాలేదా అని అపర్ణ అంటుంది. ఆ తర్వాత కావ్య జ్యూస్ తీసుకొని వస్తుంది. నేను తన చేత్తో ఇస్తే తాగనని అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |